తగ్గేదేలే..Pushpa 2లో ఐటెం సాంగ్..అప్పుడు సమంత..ఇప్పుడు ఎవరంటే?

0
208
Pushpa 2

Kajal agarwal roped for a item song in Pushpa 2: ‘Pushpa’ సినిమా తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు బన్నీ పాన్ ఇండియా స్టార్. అంతలా పుష్ప మేనియా నడుస్తుంది. ఎక్కడ చూసిన పుష్ప మ్యానరిజం చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా పుష్ప..పుష్పరాజ్ తగ్గేదే లే, శ్రీవల్లి స్టెప్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేశాయి.

ఇక ప్రస్తుతం అల్లుఅర్జున్ Pushpa 2 సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాపై ఓ వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. పుష్పలో ఐటెం సాంగ్ ఎంతలా హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊ అంటావా మామ ఊ ఊ అంటావా మామ అంటూ సమంత చేసిన రచ్చ ప్రేక్షకులను ఉర్రుతలూగించింది.

ఇక తాజాగా పుష్ప 2లో కూడా ఐటెం సాంగ్(Pushpa 2 Item Song) ప్లాన్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈసారి మరో స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని ఆలోచిస్తున్నారట. అన్ని కుదిరితే టాలీవుడ్ చందమామ కాజల్(Kajal Aggarwal) ఇందులో కనువిందు చేయబోతున్నట్టు తెలుస్తుంది. కాగా వివాహం తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కాజల్ ఇటీవల బిడ్డకు జన్మనిచ్చారు. మరి కాజల్ ఈ ఐటెం సాంగ్ కు ఒప్పుకుంటుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్..ఆ స్టార్ డైరెక్టర్ తో అల్లు అర్జున్ సినిమా