తన భర్త గురించి ఎవరికి తెలియని విషయాలు చెప్పిన కాజల్ – ప్రత్యేక ఇంటర్వ్యూ

తన భర్త గురించి ఎవరికి తెలియని విషయాలు చెప్పిన కాజల్ - ప్రత్యేక ఇంటర్వ్యూ

0
105

కాజల్ అగర్వాల్ తన ప్రేమికుడు గౌతమ్ కిచ్లూను ఘనంగా ముంబైలో వివాహం చేసుకుంది, ఆమె హీరోయిన్ గా బిజీగా ఉంటే గౌతమ్ మంచి వ్యాపారవేత్తగా బిజీగా ఉన్నాడు, అయితే ఈ అందాల చందమామ పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తాను అని తెలిపింది.

తాజాగా ఓ మేగజీన్కు ఇంటర్వ్యూ ఇచ్చిన కాజల్ తమ లవ్స్టోరీ గురించి మాట్లాడింది. గౌతమ్ కాజల్ వారిద్దరి కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారు, పదేళ్ల క్రితం వీరి పరిచయం ఇప్పుడు వివాహబంధంతో ఒకటి అయింది, మాది ఏడేళ్ల స్నేహం. మూడేళ్లు డేటింగ్ చేశాం. వీలు కుదిరినప్పుడల్లా కలిసేవాళ్లం అని తెలిపింది.

ఇక కిరాణా షాపుల దగ్గరకు వెళ్లి లాక్ డౌన్ సమయంలో కలుసుకున్నాం అని తెలిపింది, అప్పుడు మేం పెళ్లిచేసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాం.. నా గురించి అతనికి బాగా తెలుసు ఒకరిని ఒకరు బాగా అర్ధం చేసుకుని పెళ్లి చేసుకున్నాం..
రొమాన్స్ విషయంలో గౌతమ్ కాస్త తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే అతడికి ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేదు కదా. గౌతమ్ కంటే నేనే ఎక్కువ రొమాంటిక్. ఈ ఏడాది ఏప్రిల్ లో మా కుటుంబ సభ్యులతో గౌతమ్ వచ్చి పెళ్లి గురించి చెప్పాడు, ఈ ఏడాది జూన్ లో మా ఇద్దరికి ఎంగేజ్ మెంట్ జరిగింది, ఇక డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశాం.. కాని కరోనా వల్ల వెనక్కి తగ్గాం, ఇక దుస్తులు కూడా ఆన్ లైన్ లో సెలక్ట్ చేసుకున్నాం అని తెలిపింది కాజల్ తన పెళ్లి విషయాలు.