కొత్త బిజినెస్ మొదలు పెట్టిన కాజల్

కొత్త బిజినెస్ మొదలు పెట్టిన కాజల్

0
79

హీరోయిన్ కాజల్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 10 సంవత్సరాలు దాటింది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ చందమామ ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. ప్రస్తుతం తెలుగు , తమిళం సినిమాల్లో నటిస్తుంది. ఒకప్పుడు పెద్ద పెద్ద హీరోయిన్లు చాలా సినిమాల్లో నటించిన చివరకు కొంతమంది పేదరికం చవిచూశారు. ఇప్పటి తరం హీరోయిన్లు అలా కాదు అవకాశాలు వచ్చినప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు. కొంతమంది ఈ తరం హీరోయిన్లు వారి సంపాదనను భూమలు మీద పెట్టడం లేక ఏదైనా వ్యాపారంలో వెచ్చిస్తున్నారు. అలాగే కాజల్ కూడా ఒక కొత్త వ్యాపారం లోకి అడుగుపెట్టింది. కాజల్ తన సంపాదనను బంగారు వ్యాపారంలో పెట్టింది. కాజల్ ముంబై లో ఒక జ్యూయలరీ షాప్‌ను ప్రారంభించింది.