కళ్యాణ్ రామ్ బింబిసార మూవీ అప్డేట్..విజువల్ వండర్ గా ”ఓ తేనె పలుకుల” సాంగ్- Video

0
114

నందమూరి కల్యాణ్‌ రామ్‌ తాజాగా నటిస్తున్న సినిమా బింబిసార. ఎ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌.. అన్నది ఉపశీర్షిక. వశిష్ట్‌ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో కేథరీన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టారు.

ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ ఊహించని విధంగా రికార్డులు సృష్టిస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా నుండి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం నుండి ఇప్పటికే ఈశ్వరుడే సాంగ్ ను రిలీజ్ చేసారు. ‘భువి పై ఎవడూ కనివిని ఎరుగని అద్భుతమే జరిగినే.. దివిలో సైతం కథగా రాని విధి లీలే వెలిగినే..’ అంటూ సాగిన ఈ పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఇక తాజాగా ఈ చిత్రం నుండి “ఓ తేనె పలుకుల” అనే డ్యూయెట్ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పాటలో అందాల భామ కేథరిన్ తేజ్రాతో కళ్యాణ్ రామ్ చేసిన రొమాన్స్ అద్భుతంగా ఉండగా.. విజువల్ పరంగా ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

“ఓ తేనె పలుకుల” సాంగ్ చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=pd_0x7SlSws&feature=emb_title