Review: కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ రివ్యూ

0
105

కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. ఈ సినిమాతో వశిష్ట్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు. కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. కీలక పాత్రల్లో  ప్రకాశ్ రాజ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ కథతో తెరెకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నేడు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాతో బింబిసారుడు (కళ్యాణ్ రామ్) హిట్ కొట్టాడో లేదో తెలుసుకుందాం..

కథ ఏంటంటే?

త్రిగర్తల సామ్రాజ్యాన్ని పాలించే రాజు బింబిసారుడు. అనుకోని పరిస్థితుల్లో క్రీస్తు పూర్వం 500వ ఏడాది నుంచి 2022కి వస్తాడు. అయితే ఈ కాలానికి రావడానికి కారణం ఏంటి.? ఇక్కడికి వచ్చాక బింబిసారుడిలో వచ్చిన మార్పులు ఏంటి? తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

ఎవరెలా చేశారు?

ఈ సినిమా చూస్తే కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. బింబిసారునిగా, ప్రస్తుత కాలానికి వచ్చిన వ్యక్తిగా రెండు షేడ్స్‌లోనూ అదరగొట్టారు. సెకండాఫ్‌లో మారిన బింబిసారుడు అద్భుతంగా నచ్చేస్తాడు. హీరోయిన్స్ సంయుక్త మీనన్, కేథరిన్ థ్రెసా, ప్రకాశ్ రాజ్ ఉన్న మేరకు నటించారు. విలన్స్‌గా అయ్యప్ప పి శర్మ, వారిన హుస్సేన్ బాగున్నారు.

చిరంతన్ భట్ పాటలు అంతగా ఆకట్టుకోలేదు. కీరవాణి ఆర్ఆర్ మాత్రం అదిరిపోయింది. అడగాలే గానీ పాట కూడా చాలా బాగుంది. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. తమ్మిరాజు ఎడిటింగ్ కూడా షార్ప్‌గా ఉంది. దర్శకుడు వశిష్ట చందమామ కథలా దీన్ని ఓపెన్ చేసారు.. దాన్ని అలాగే కంటిన్యూ చేసారు.

ప్లస్ పాయింట్స్:

కళ్యాణ్ రామ్ నటన

కీరవాణి బ్యాగ్రౌండ్

ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

పాటలు ఆకట్టుకోలేకపోవడం

కథలో స్లో నేరేషన్

రేటింగ్: 2.5/5