Devil Trailer | “కుక్క అనుకున్నావురా… లయన్”.. ‘డెవిల్’ ట్రైలర్ రిలీజ్..

-

Devil Trailer | నందమూరి కల్యాణ్‌ రామ్(Kalyan Ram) హీరోగా నటించిన తాజా చిత్రం ‘డెవిల్’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియో, పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. బ్రిటీష్ కాలం నాటి కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో సంయుక్తా మీనన్(Samyuktha Menon), మాళవిక నాయర్(Malvika Nair) హీరోయిన్లుగా నటించారు. యాక్షన్ ఎపిసోడ్‌తో ఆకట్టుకున్న ట్రైలర్ చివర్లో “విశ్వాసంగా ఉండడానికి, విధేయతతో బతికేయడానికి కుక్క అనుకున్నావురా… లయన్” అంటూ కల్యాణ్‌ రామ్ మీసం మెలేయడం మూవీపై అంచనాలు నెలకొనేలా చేసింది.

- Advertisement -

Devil Trailer |ఇక ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. డిసెంబరు 29న ఈ చిత్రం విడుదల కానుంది. కాగా ‘బింబిసార’ మూవీతో సూపర్ హిట్ అందుకున్న కల్యాణ్ రామ్.. ఆ తర్వాత వచ్చిన ‘అమిగోస్’ నిరాశపర్చింది. ఇప్పుడు ‘డెవిల్’ చిత్రంపైనే భారీ ఆశలు పెట్టుకున్నారు.

Read Also: తెలంగాణలో వచ్చే ఏడాది సెలవులు ఇవే..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...