కాపురంలో చిచ్చు పెట్టిన కళ్యాణ లక్ష్మి భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న నవవధువు

కాపురంలో చిచ్చు పెట్టిన కళ్యాణ లక్ష్మి భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న నవవధువు

0
135

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకం ఓ కుటుంబంలో చిచ్చుపెట్టింది. అదనపు కట్నం తోపాటు కల్యాణలక్ష్మి సొమ్ము తీసుకురావాలని భర్త వేధించడంతో మానసికంగా కుంగిపోయిన ఆ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరంలోని హై దర్షా కొట్ ప్రాంతంలో నివాసముంటున్నారు సురేష్ కుమార్, మమతా దంపతులు. స్థానికంగా ఓ ప్రైవేటు ప్రింటింగ్ కంపెనీలో పనిచేస్తున్న సురేష్ కళ్యాణ లక్ష్మి పథకం కింద వచ్చిన నగదును, దాంతో పాటు అదనపు కట్నం కూడా తీసుకు రావాలని మమతను వేధించసాగాడు.

దీంతో దంపతుల మధ్య రోజు గొడవలు జరిగేవి. భర్త తీరుతో కుంగిపోయిన మమత అతను బయటికి వెళ్ళగానే ఫ్యాన్కు ఉరి వేసుకుని చనిపోయింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.