కల్యాణ్ రామ్ తో మైత్రీ మేకర్ బిగ్ ప్రాజెక్ట్

కల్యాణ్ రామ్ తో మైత్రీ మేకర్ బిగ్ ప్రాజెక్ట్

0
86

కల్యాణ్ రామ్ మార్కెట్లో ప్రతీ ఏడాది ఓ సినిమాతో అభిమానులని అలరిస్తున్నాడు, అయితే తాజాగా కల్యాణ్ రామ్ మైత్రీ మేకర్స్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు అనేది ఓ వార్త వినిపించింది. పెద్ద సంస్ధ కావడంతో సినిమా వార్త నిజమే అని చాలా మంది భావించారు.

కాని దీనిపై ఎక్కడా ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు, అయితే కల్యాణ్ రామ్ ఇప్పుడు చాలా బీజీగా ఉన్నారు, ఆయన చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి.. అన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినవే…మల్లిడి వేణు డైరక్షన్ లో స్వంత బ్యానర్ మీద ఒక చిత్రం చేయనున్నారు . విఐ ఆనంద్ డైరక్షన్ లో మహేష్ కోనేరు నిర్మించేది రెండో చిత్రం .. ప్రముఖ దర్శకుడు గుహాన్ డైరక్షన్ లో దిల్ రాజు నిర్మించే సినిమా మూడో చిత్రం.

తాజాగా మైత్రీవారితో కల్యాణ్ రామ్ నాల్గవ చిత్రం లైన్ లో పెట్టారా అని నందమూరి అభిమానులు అనుకుంటున్నారు. అయితే మైత్రీ వారు తాజాగా కల్యాణ్ రామ్ ని కలిశారట.. సినిమా గురించి చర్చించారట.. ఇందులో కల్యాణ్ రామ్ ముగ్గురుగా కనిపిస్తాడట, ట్రిపుల్ రోల్ మరి ఈ ప్రాజెక్ట్ అప్పుడే కాదని ఈ మూడు సినిమాలు పూర్తి అయ్యాక చూద్దాం అని కల్యాణ్ రామ్ చెప్పాడని టాక్ నడుస్తోంది.