లోకనాయకుడు కమల్ హాసన్ కరోనా భారిన పడిన విషయం తెలిసిందే. ఇటీవల అమెరికాకు వెళ్లి వచ్చిన తర్వాత కమల్‌కు కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం కమల్ చెన్నై లోని కమలహాసన్ శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ లో చికిత్స తీసుకుంటున్నారు.
తాజాగా కమల్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన కోలుకుంటున్నారని పేర్కొన్నారు. ఇక కమల్ కరోనా భారిన పడటంతో ఆయన మిత్రుడు సూపర్ స్టార్ రజినీకాంత్ ఆయనకు ఫోన్ చేసి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.
అమెరికా నుంచి వచ్చిన కమల్ అనంతరం దగ్గు, జ్వరం, తలనొప్పి మొదలవ్వడంతో కొవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. అయితే అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్యం బాగనే ఉందని కమల్ కుమార్తె హీరోయిన్ శృతిహాసన్ తెలిపింది. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కమల్ కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.