వచ్చే కొన్ని నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్నాయి, ఇప్పటికే రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం రెడీ అవుతున్నాయి, ఇక రజనీ పార్టీ పెడతారు అని అందరూ భావింంచారు కాని ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం లేదు, ఇక ఇప్పుడు కమల్ పార్టీపై ప్రజలు కూడా పెద్దగా చర్చించుకుంటున్నారు.
కమల్ హాసన్ మక్కళ్ నీది మయ్యం ఎంఎన్ఎం పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పార్టీకి
కేంద్ర ఎన్నికల సంఘం టార్చిలైటు గుర్తు కేటాయించింది. గతంలో కూడా ఈ గుర్తు కేటాయించింది. ఇప్పుడు ఎన్నికల వేళ ఈ గుర్తు కేటాయించారు.
తమకు టార్చిలైటు గుర్తును కేటాయించినందుకు ఈసీకి కృతజ్ఞతలు తెలుపుతున్నామని వెల్లడించారు
కమల్, ఈ వెలుగుని మనం అందరికి వ్యాపించేలా చేద్దాం అని పిలుపునిచ్చారు ఆయన. ఇక ఈ వార్త విని అభిమానులు అందరూ చాలా ఆనందంలో ఉన్నారు.