కమల్ హాసన్ ముద్దుల కూతురు శృతీహాసన్ చిత్ర సీమలో ఎంత టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుందో తెలిసిందే.. అందరూ అగ్రహీరోలు స్టార్ నటులతో ఆమె నటించింది. గబ్బర్ సింగ్ బలుపు, రేసుగుర్రం, రామయ్యా వస్తావయ్యా, ఎవడు, శ్రీమంతుడు, కాటమరాయుడు ఇవన్నీ కూడా ఆమెకి సూపర్ హిట్లుగా నిలిచాయి, ఇక తాజాగా వకీల్ సాబ్ చిత్రంలో కూడా ఆమె నటిస్తోంది.
తన తండ్రికి సినీ ఇండస్ట్రీలో బడా బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ, స్వశక్తితో ఇండస్ట్రీలో ఎదిగింది శృతీహాసన్. ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ తన కూతుళ్ల కెరీర్ గురించి, పెళ్లి గురించి కొన్ని కామెంట్స్ చేశారు.కూతుళ్లను సైంటిస్టులను చేయాలన్న ఆశ ఉండేది. కాని వాళ్లకు స్వేచ్చ ఇచ్చాను, వారికి సినిమాల్లో ఎలాంటి సలహాలు ఇవ్వను మెళకువలు చెబుతాను అని అన్నారు కమల్.
నేను ఫలానా వ్యక్తిని ప్రేమించాను డాడీ అని నాకు చెప్తే నేనేమీ వ్యతిరేకించను. వారి ఇష్టం వారి భవిష్యత్తు మీద వారికి అవగాహన ఉంటుంది.. ఇక కులాల గురించి నాకు పట్టింపు ఉండదు, వారు వేరు కులం వారిని చేసుకుంటే నేను మరింత సంతోషిస్తా అని చెప్పారు ఆయన… ఇక నా తదనంతరం నా డబ్బును తీసుకోవద్దని నా పిల్లలకు చెప్పాను, అదంతా ప్రజలకు ఇవ్వాలి అని చెప్పానని కమల్ అన్నారు.