మరోసారి వర్మ సినిమాకి బ్రేకులు

మరోసారి వర్మ సినిమాకి బ్రేకులు

0
98

వివాదాస్పద చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు దర్శకుడు వర్మ, తాజాగా ఆయన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు చిత్రం తీశారు. ఈ సినిమా హైకోర్టు వరకూ వెళ్లింది. రేపు సినిమా రిలీజ్ అవుతోంది అనగా మరోసారి చిత్రానికి హైకోర్ట్ బ్రేక్ వేసింది.. ప్రివ్యూ చూసిన ప్రిలిమినరీ కమిటీ సినిమాను తిరస్కరించింది. ప్రదర్శించడానికి వీలులేని సినిమా అంటూ ప్రధాన న్యాయమూర్తికి ప్రిలిమినరీ కమిటీ నివేదిక ఇచ్చింది.

ఈ చిత్రంలో కొందరిని కించపరిచారు అని చెప్పింది దీంతో ఈ అభ్యంతరాలు పరిశీలించాలి అని రివైజ్ కమిటీని హైకోర్టు ఆదేశాలు జారి చే,సింది తర్వాత మాత్రమే సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వాలని హైకోర్టు తెలిపింది.. ఏమైనా లోపాలు ఉంటే మళ్లీ పిటిషన్ వేయచ్చు అంటూ హైకోర్ట్ తెలియచేసింది.

సినిమాపై అటు సెన్సార్ బోర్డు, ఇటు చిత్ర యూనిట్ కౌంటర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే… సినిమాల్లో ఎలాంటి సీన్లు లేవు అని అభ్యంతరాలు ఉన్న సీన్లు తొలగించాం అని తెలియచేశారు.. కాని సీన్లు తీయలేదు అని కేవలం మ్యూట్లో ఉంచారని మాత్రమే కౌంటర్లో పేర్కొన్నారని హైకోర్టు తెలిపింది… మ్యూట్ చేస్తే సరిపోదని చిత్ర యూనిట్కు తెలిపింది హైకోర్టు.