కంగనాకు మరో షాక్ ఇచ్చి మహారాష్ట్ర సర్కార్…

కంగనాకు మరో షాక్ ఇచ్చి మహారాష్ట్ర సర్కార్...

0
116

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మహాసర్కార్ మధ్య వివాదం మరింత ముదిరింది… హిమాచల్ నుంచి ముంబైకు వచ్చిన కంగనా రనౌత్ కి కూల్చి వేతతో స్వాగతం పలికింది మహారాష్ట్ర సర్కార్… ప్రస్తుతం అధికారులు కంగనా ఆఫీస్ ను కూల్చి వేస్తున్నారు… అధికారులు జేసీబీలతో ముందు భాగాన్ని తొలగిస్తున్నారు…

అనుమతిలేకుండా ఆఫీస్ లో మార్పులు చేశారంటూ నిన్న నోటీసులను జారీ చేసింది సర్కార్ ఆఫీస్ లో ఎవ్వరు లేకపోవడంతో ఆమె ఆపీస్ కు నోటీసులు అంటించారు… ముందుగా చెప్పినట్లుగానే అన్నంతపని చేసింది…కంగనా ముంబైలో అడుగు పెట్టకముందే మణికర్నిక ఆఫీస్ కూలగొడుతున్నారు…

ఈ కూల్చి వేతపై కంగనా హైకోర్టును ఆశ్రయించింది.. ముంబై మరో పీవోకే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది తన ఆఫీస్ రామ మందిరంలాంటిది అయోద్యలో రామాలయాన్ని బాబర్ కుల్చివేసినట్లు తన ఆఫీస్ ను కూల్చి వేస్తున్నారని ఫైర్ అయింది… కూల్చి వేసిన ఆ ఆలయాన్ని ఎలా నిర్మించుకోవాలో తనకు తెలుసని చెప్పింది…