కన్నడ హీరో శివరాజ్ కుమార్(Shiva Rajkumar) ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదు. కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని కొన్ని రోజులుగా వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వీటిపై హీరో శివరాజ్‌కుమార్ స్పష్టతనిచ్చాడు. తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలు రూమర్లు కాదని అవి వాస్తవాలేనని ఆయన ధృవీకరించాడు. ప్రస్తుతం భైరతి రణగల్(Bhairathi Ranagal) సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న శివరాజ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నానని చెప్పాడు.
‘‘నేనూ మనిషినే కదా. నాకు సమస్యలు వస్తుంటాయి. అలా ఓ అనారోగ్య సమస్య ఎదరైంది. మొదట దాని గురించి తెలిసి భయపడ్డాను. ఆ తర్వాత ధైర్యం చేసి చికిత్స తీసుకుంటున్నాను. ఈ చికిత్సలో భాగంగా ఇప్పటికి నాలుగు సెషన్లు పూర్తయ్యాయి. ఇప్పడిప్పుడే కోలుకుంటున్నాను’’ అని తెలిపాడు శివరాజ్(Shiva Rajkumar). కాకపోతే అతనికి వచ్చిన అనారోగ్యం ఏంటనేది మాత్రం చెప్పలేదు. మరో రెండు సెషన్ల చికిత్స పూర్తయితే ఆ తర్వాత అమెరికాలో శస్త్ర చికిత్స చేయించుకోనున్నారన్న మాట కూడా వినిపిస్తోంది.