బుల్లితెర నటి శోబిత(Sobhita) ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్న ఘటన యావత్ కన్నడ పరిశ్రమను కుదిపేసింది. ఎన్నో సిరియళ్లలో కీలక పాత్రలు పోషించి తనకుంటూ ప్రత్యేక గుర్తింపు అందుకుంది శోభిత. ఆమె తెలంగాణ హైదరాబాద్ గచ్చిబౌలిలోని శ్రీరాంగనగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. శోభిత(Sobhita) మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా శోభితకు సంబంధించి చుట్టుపక్కల వారి దగ్గర నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే పెళ్ళి అయిన తర్వాత నుంచి శోభిత.. సినిమాలు, సీరియళ్లకు దూరంగా ఉంటూ వచ్చింది. ఆ క్రమంలోనే దంపతులిద్దరూ హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యారు. ఇంతలో ఆమె ఆత్మహత్యకు పాల్పడటం అనేక అనుమానాలకు తావిస్తోంది.
దంపతులిద్దరి మధ్య ఏమైనా కలహాలు ఉన్నాయా? వాటి వల్లనే శోభిత ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ ఘటనను తాము అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.