Flash News- కన్నడ స్టార్‌ హీరో ఇంట మరో విషాదం

Kannada star hero house is another tragedy

0
70

కన్నడ స్టార్‌ హీరో ‘దునియా’ విజయ్‌ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. అతని తండ్రి రుద్రప్ప (81) గురువారం కన్నుమూశారు. ఇటీవలే ఆయన తల్లి నారాయణమ్మ కూడ అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న రుద్రప్పను కుటుంబ సభ్యులు మూడో రోజుల క్రితం బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా విజయ్‌ తల్లి నారాయణమ్మ కూడా ఈ ఏడాది జులైలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఇప్పుడు అతని తండ్రి కూడా మరణించడంతో విజయ్‌ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.