Kantara Movie Varaha rupam song Court lifted ban: అంచనాలను మించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల తుఫాన్ సృష్టించిన కాంతారా చిత్ర బృందానికి పెద్ద ఊరట లభించింది. సినిమాకు ఆయువు పట్టుగా ఉన్న వరాహా రూపం అనే పాటపై కాపీ రైట్స్ ఇష్యూతో దానిపై నిషేధం వేటు పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కేరళలోని కోజికోడ్ కోర్టు పాటపై నిషేధాన్ని ఎత్తివేస్తూ తీర్పునిచ్చింది.
థాయికుడమ్ బ్రిడ్జ్ అనే మ్యూజిక్ బ్యాండ్ వరాహా రూపం పాట.. తాము రూపొందించిన నవరసం ఆల్బమ్‌ను కాపీ చేసి.. పాటను రూపొందించారని కోర్టులో పిటిషన్ వేసింది. దీంతో పాటను ప్రసారం చేయటం ఆపేయాలనీ, ఓటీలలో విడుదల చేసినప్పుడు పాటను కత్తిరించేయాలని చెప్పటంతో.. (Kantara Movie) చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ ఈ సాంగ్‌ను యూట్యూబ్ నుంచి తొలగించారు. ఓటీటీలో మరొక పాటతో రీప్లేస్ చేశారు. అయితే ప్రస్తుతం కోజికోడ్ కోర్టు పాటపై నిషేధం ఎత్తివేయటంతో.. ఒరిజనల్ వెర్షన్‌ను ఓటీటీలో రీప్లేస్ చేసే అవకాశం ఉంది.


