హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న కంఠీరవ రాజ్ కుమార్ మ‌న‌వ‌రాలు

Kanthirava Rajkumars Granddaughter an entry as a heroine

0
268

సౌత్ ఇండియాలో న‌టుల్లో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ ఒక‌రు. ఆయ‌న సినిమాల్లో ఎంతో పేరు సంపాదించుకున్నారు.ఎన్టీఆర్, ఎంజీఆర్ లతో స‌మానంగా ఆయ‌న కూడా అంతే పేరు సంపాదించుకున్నారు. ఆయన కుమారులు శాండల్ వుడ్ లో అగ్రనటులుగా కొనసాగుతున్నారు.
ఇక ఆయన కుటుంబం నుంచి చిత్ర సీమ‌లోకి మ‌రొక‌రు ఎంట్రీ ఇస్తున్నారు.

ఇది మూడోత‌రం అనే చెప్పాలి. రాజ్ కుమార్ మనవరాలు అంటే రాజ్ కుమార్ కూతురు పూర్ణిమ, రామ్ కుమార్ దంపతుల కూతురు ధన్యా రామ్ కుమార్ సినీ రంగంలోకి అడుగు పెట్టారు. నిన్నా సానిహకే సినిమాలో ఆమె హీరోయిన్ గా న‌టించారు. క‌రోనా కార‌ణంగా షూటింగ్ పూర్తి చేసుకున్నా సినిమా ఇంకా విడుద‌ల కాలేదు.

ఇప్పుడు కేసులు త‌గ్గ‌డంతో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహకాలు చేస్తున్నారు.
సినీ రంగంలోకి రావాలనుకునే అమ్మాయిలకు తాను ఒక ఉదాహరణగా నిలవాలని అనుకుంటున్నానని తెలిపారు. ఆమెకి క‌న్న‌డ వ్యాప్తంగా అంద‌రూ ఈ చిత్రం సూప‌ర్ హిట్ అవుతుంది అని బెస్ట్ విషెస్ అంద‌చేస్తున్నారు.