సినీ నటి కరాటే కల్యాణి(Karate Kalyani) సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తన పాత ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆమె ఫిర్యాదుచేశారు. లలిత్ కుమార్ తో పాటు మరికొంత మందిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. రాజకీయాల్లో తన ఎదుగుదల తట్టుకోలేక ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని కల్యాణి ఆరోపిస్తున్నారు. కాగా ఖమ్మంలో కృష్ణుడు రూపంలో ఉన్న దివంగత సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం(NTR Statue) ఆవిష్కరణ నిలిపివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించగా.. విగ్రహావిష్కరణ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్ పై ఆమె చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ కల్యాణిని(Karate Kalyani) ‘మా’ నుంచి సస్పెండ్ చేసింది.
Read Also:
1. అనకాపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్.. పలు రైళ్లు రద్దు
2. లండన్‌లో తెలుగు యువతి దారుణ హత్య
Follow us on: Google News, Koo, Twitter, ShareChat