బిగ్ బాస్ హౌజ్ లో మోనాల్ పై సంచలన కామెంట్ చేసిన కరాటే కల్యాణి

-

బిగ్ బాస్ హౌజ్ కాస్త మసాలా రిలేషన్ ఉండేవారిని మాత్రమే ఉంచుతున్నారని సరిగ్గా గేమ్ ఆడేవారిని ఉంచకుండా ఎలిమినేట్ చేస్తున్నారు అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, ఇక ఎలిమినేషన్ ప్రక్రియలో ఇదే కామెంట్లు వినిపిస్తున్నాయి, దేవి నాగవల్లి, స్వాతీ దీక్షిత్ ఎలిమినేషన్ తో ఈ కామెంట్లు మరింత పెరిగాయి.

- Advertisement -

అయితే సుజాత ఎలిమినేషన్ తర్వాత ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ ఆమెతో పాటు కరాటే కళ్యాణిని కూడా లైవ్లో కూర్చోబెట్టింది. రెండో వారం బయటికి వచ్చినపుడే సుజాతపై చాలా సీరియస్ కామెంట్స్ చేసింది కళ్యాణి. కాని ఇప్పుడు ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు.

తాజాగా కరాటే కళ్యాణి అయితే మోనాల్పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తన ఎలిమినేషన్పై చాలా అనుమానాలు ఉన్నాయని.. మెహబూబ్ను కావాలనే సేవ్ చేస్తున్నారని ఆరోపించింది కళ్యాణి.దేవీని కూడా కావాలనే బయటకు పంపారు అని కామెంట్ చేసింది, ఇక ఏ ఇంటి సభ్యుడికి ఎన్ని ఓట్లు వచ్చాయో చెబితే అప్పుటి వరకూ ఇలా అనుమానాలు ఉంటాయి అని తెలిపింది ఆమె.

తనతో పాటు సుజాత లాంటి వాళ్లు స్కిన్ షో చేయలేమని.. నిండా కప్పుకుని ఉంటాం కాబట్టి మా లాంటి వాళ్లను ఎలిమినేట్ చేస్తారని చెప్పింది. అదే మోనాల్ గజ్జర్ లాంటి వాళ్లు అయితే వీకెండ్ అయితే గ్లామర్ షో చేస్తారని.. వారి అవసరం ఉంది కాబట్టే ఆమెని హౌస్ లో ఉంచారు అని కామెంట్ చేసింది. మొత్తానికి తెలుగు సరిగ్గా రాకపోయినా టాస్కులు పెద్ద ఆడకపోయినా మోనాల్ ని హౌస్ లో ఎలా ఉంచుతున్నారో అర్దం కావడం లేదు అంటున్నారు నెటిజన్లు బిగ్ బాస్ అభిమానులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...