కరీనా కపూర్ ఫుడ్ ఏం తింటుందో తెలిస్తే షాక్

కరీనా కపూర్ ఫుడ్ ఏం తింటుందో తెలిస్తే షాక్

0
108

సినిమా తారల అందానికి సీక్రెట్ ఏమిటి అని చాలా మంది అడుగుతారు.. వారి ఆహరం జిమ్ వర్క్ అవుట్స్ ఇలా చాలా కారణాలు చెబుతారు.. అయితే కొందరు ఇలాంటివి చెప్పడానికి అంత ఇష్టపడరు.. 40 దాటినా 20 ఏళ్ల అమ్మాయిలా కనిపించే సినిమా తారలు చాలా మంది ఉన్నారు ..బాలీవుడ్ లో అలాంటి వారు చాలా మంది స్క్రీన్ పై ఇంకా మెరుస్తూ అభిమానులని అలరిస్తున్నారు.

అలాంటి వారిలో కరీనా కపూర్ ఒకరు … బాలీవుడ్ లో సైజు జీరో ని పరిచయం చేసిన హాట్ హీరోయిన్ ఆమె అని చెప్పాలి. పెళ్లి అయి పిల్లవాడు ఉన్నా అదే అందంతో మెరుస్తోంది. అయితే ఆమె ఎప్పుడూ జిమ్ చేస్తుంది అని అందుకే అంత సన్నగా ఉంటుంది అని చాలా మంది అనుకుంటారు… కాని ఇది వాస్తవం కాదు అంటున్నారు.ఈ విషయంలో సైఫ్ కూడా అంతే లుక్స్ పరంగా భార్యకు పోటీకి వస్తాడు.

అయితే కరీనా కపూర్ ఇప్పటికి అంత సన్నగా ఉండడానికి జిమ్ వర్కౌట్ కారణం కాదని, ఆమె తీసుకునే ఆహారమంటున్నారు ఆమె డైటిస్ట్. అయితే ఆమె తన ఆహరంగా ఏం తీసుకుంటుందో తెలుసా. ఉదయం 10 నుంచి 15 గ్రాముల ఎండుద్రాక్ష తీసుకుంటుంది. అలాగే పరాట బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటుంది, ఆయిల్ లెస్ గా చేసుకుంటుందట.

లంచ్ లో పెరుగన్నం, అప్పడం తింటుంది భోజనానికి ముందు కొబ్బరి నీళ్లు తాగుతుందని, ఇంకా ఈవెనింగ్ మిల్క్ షేక్, నైట్ భోజనంలో వెజ్ పులావ్ తో పాటు కంద, పెరుగు తింటుదట. ఇది కరీనా డైట్ అంతేకాదు కేవలం 5 గంటలు మాత్రమే వారానికి జిమ్ చేస్తుందట.