దళపతి విజయ్ కు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన కర్ణాటక ఫ్యాన్స్

Karnataka fans give an unforgettable gift to Dalapati Vijay

0
131

దళపతి విజయ్ ఆయనకు దేశ వ్యాప్తంగా ఎంత మంది అభిమానులు ఉన్నారో తెలిసిందే. తమిళనాట విజయ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా కలెక్షన్లు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విజయ్ ప్యాన్ ఇండియా స్టార్. ఇక తమిళనాడులో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంతటి అభిమానం సంపాదించుకున్న హీరో విజయ్.

ఇక ఆయనకు తమిళనాడు, తెలుగులో, ఇటు కర్ణాటకలో, కేరళలో కూడా భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇక తాజాగా ఆయనకు కర్ణాటక ఫ్యాన్స్ మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. కర్ణాటకలోని మంగుళూరుకు చెందిన దళపతి విజయ్ అభిమానులు, విజయ్ విగ్రహాన్ని రూపొందించి చెన్నైకి తీసుకువచ్చి బహుమతిగా ఇచ్చారు.

ఈ విగ్రహాన్ని విజయ్ మక్కల్ ఇయక్కం పన్నైయూర్ కార్యాలయంలో శాశ్వతంగా ఉంచుతామని చెప్పారు. ఈ విగ్రహం చూసేందుకు పెద్ద ఎత్తున విజయ్ అభిమానులు వస్తున్నారు.దక్షిణాది చిత్ర సీమలో రజినీకాంత్, మమ్ముట్టి, మోహన్ లాల్, చిరంజీవి లాంటి హీరోలతో సమానంగా విజయ్ పేరు సంపాదించుకున్నారు. ఆయనతో సినిమా చేయాలని దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.