చిత్రపరిశ్రమకు కరోనా ….నటుడు నటికి సోకిన కరోనా వైరస్

చిత్రపరిశ్రమకు కరోనా ....నటుడు నటికి సోకిన కరోనా వైరస్

0
132

కరోనా ఇప్పుడు పరిశ్రమ వర్గాలకి సామాన్యులకే కాదు చిత్ర పరిశ్రమని కూడా తాకింది …హాలీవుడ్ కు ఈ వైరస్ పాకడంతో చిత్ర పరిశ్రమ షాక్ అయింది ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా నెల రోజులుగా సినిమా షూటింగ్ లు అన్నీ నిలిపివేశారు, ఇతర దేశాలలో షెడ్యూల్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు.

తాజాగా హాలివుడ్ ప్రముఖ సినీనటుడు టామ్ హంక్స్, అతని భార్య రీటా విల్సన్లకు కరోనా వైరస్ సోకిందని వైద్యపరీక్షల్లో తేలింది. ఆస్ట్రేలియా దేశంలో ఓ సినిమా షూటింగులో ఉన్న సెలబ్రిటీ దంపతులు బుధవారం రక్తపరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చారు. వారికి కరోనా వైరస్ సోకిందని తేలడంతో టామ్ హంక్స్, రీటా విల్సన్ దంపతులకు ఐసోలేషన్ గదికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తాజాగా ఈ విషయాన్ని టామ్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసుకున్నాడు, తమకు జలుబు ఒంటి నొప్పులు ఉన్న కారణంగా చెక్ చేయించుకున్నాం అని ఎలాంటి ప్రాణాపాయం లేదు అని తెలిపాడు,దీంతో హాలీవుడ్ ప్రముఖులు వారి ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నారు.