కార్తీ డైరెక్టర్ పై కన్ను వేసిన రామ్ చరణ్..!!

కార్తీ డైరెక్టర్ పై కన్ను వేసిన రామ్ చరణ్..!!

0
88

రామ్ చరణ్ తేజ్ RRR సినిమా తర్వాత తన తరువాతి చిత్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.. వంశీ పైడిపల్లి ఈ సినిమా కి డైరెక్షన్ అందిస్తాడు అనుకున్నారు కానీ అనూహ్యంగా ఓ తమిళ డైరెక్టర్ ను లాక్ చేసినట్టు తెలుస్తుంది.ఆ డైరెక్టర్ మరెవరో కాదు ఇటీవల కార్తీ తో ‘ఖైదీ’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన లోకేష్ కానగరాజన్. ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన వెంటనే చరణ్ ఈ తమిళ డైరెక్టర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.

ఇక లోకేష్ కనగరాజన్ ప్రస్తుతం ఇళయ దళపతి విజయ్ తో సినిమా చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ లు పూర్తయ్యాకే… వీరి కాంబినేషన్లో సినిమా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.