కార్తీక దీపం సీరియల్ కి తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానులు ఉన్నారు … ముఖ్యంగా ఇందులో దీప క్యారెక్టర్ అందరికి ఇష్టం… భర్త దూరం పెట్టడంతో కుమార్తెతో కలిసి వంటలక్కగా కష్టపడి కుటుంబాన్ని పోషించడం , ఇక కొడుకుని కోడలిని కలపాలి అని అత్త సౌందర్య చేసే ప్రయత్నం.. మోనిత అడ్డుపడటం ఇలా స్టోరీ అంతా ప్రేక్షకులకి చూడాలి అనే ఆసక్తిని కలిగిస్తోంది.
ఈ సీరియల్లో వంటలక్కగా చేస్తోన్న ప్రేమి విశ్వానాథ్ గురించి కొన్ని విషయాలు చూద్దాం..
ప్రేమి విశ్వనాథ్ డిసెంబర్ 2 న 1991వ సంవత్సరంలో కేరళలో జన్మించింది. ఆమె చిన్నతనం నుంచి చదువుల సరస్వతి అనే చెప్పాలి.
కరుతముత్తు అనే సీరియల్ ద్వారా ఆమె అక్కడ బాగా పాపులర్ అయ్యింది. ఆ సీరియల్ తెలుగులో కార్తీక దీపంగా ఇక్కడ తీస్తున్నారు… విశ్వనాథ్, కాంచన విశ్వనాథ్ లకు ఆమె జన్మించించి.. ఇక ఆమె భర్త పేరు డాక్టర్ టి ఎస్ వినీత్ భట్. అస్ట్రాలజీలో ఇండియాలోనే ఫేమస్.. ఆయన దగ్గరకు సినిమా నటులు పారిశ్రామిక వేత్తలు పెద్ద పెద్ద అధికారులు రాజకీయ నేతలు జ్యోతిష్యం గురించి వస్తూ ఉంటారు..
ఆమెకు ఒక అన్నయ్య ఉన్నాడు.. అతని పేరు శివ ప్రసాద్. ఎర్నాకుళంలో ఆమె కుటుంబంతో ఉంటోంది.ఆమె సోదరుడు శివ ప్రసాద్ ఓ ఫోటోగ్రాఫర్. ఆయనకు ఎర్నాకుళంలో రెండు స్టూడియోలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఈవెంట్లకు ఆయన ఫోటోలు తీస్తూ ఉంటారు. ఇప్పుడు ఆమెకి పలు సినిమా అవకాశాలు వస్తున్నాయి.