RRR, KGF 2 సినిమాలను మించి కార్తికేయ 2 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్..ఆర్జీవీ కామెంట్స్ వైరల్

0
100
RGV

యంగ్ హీరో నిఖిల్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కార్తికేయ 2’. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘కార్తికేయ’ మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ గా కార్తికేయ 2ను రూపొందించారు. మొదటి భాగాన్ని తెరకెక్కించిన చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్​ గా నటించగా..అనుపమ్ ఖేర్, శ్రీనివాస రెడ్డి, వైవా హర్ష ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈనెల 13న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల అయింది. ఇక కార్తికేయ 2 బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. కృష్ణుడు, ద్వారకా నగరం వంటి అంశాలు సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇప్పటికే 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమాపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. వర్మ ఈ ట్వీట్ లో.. ” నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా రెండవ శుక్రవారం కూడా అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షాబంధన్ కంటే డబల్ కలెక్షన్స్ సాధించింది. రాజమౌళి ఆర్ఆర్ఆర్, ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ 2 కంటే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా” అని పోస్ట్ చేశారు. డైరెక్టర్ చందూ మొండేటి కంగ్రాట్స్ తెలిపారు. దీంతో ఆర్జీవీ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.