కలెక్షన్ల సునామి సృష్టిస్తున్న కార్తికేయ-2..నిఖిల్ తీసుకున్న పారితోషికం మాత్రం ఎంతో తెలుసా?

0
95

నిఖిల్‌ కథానాయకుడిగా చందూ మొండేటి తెరకెక్కించిన సినిమా కార్తికేయ-2. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘కార్తికేయ’ రాగా దీనిని సీక్వెల్ గా కార్తికేయ-2ను తీశారు. ఈనెల 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ మూవీకి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. నిఖిల్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా నిలిచింది.

కృష్ణతత్వంతో పాటు హిస్టరీ వర్సెస్ మైథాలజీ అనే అంశంపైన దర్శకుడు సినిమాలో చక్కగా చర్చించారు. ముఖ్యంగా అనుపమ్ ఖేర్ పాత్ర రాగానే థియేటర్లలో జనాలు హ్యాపీగా ఫీలవుతున్నారు. ‘ధన్వంతరి వేద్ పాఠక్’గా అనుపమ్ ఖేర్ చెప్తున్న మాటలు విని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఈ సినిమాకు నిఖిల్ పారితోషికం గురించి ఇప్పుడు చర్చ మొదలయింది. ఇప్పటికే రూ.వంద కోట్ల క్లబ్ లో చేరిన ‘కార్తీకేయ-2’ ఇంకా రికార్డు వసూళ్లు చేస్తుంది. కానీ ఈ సినిమాకు నిఖిల్ కేవలం రూ.మూడున్నర కోట్లు మాత్రమే తీసుకున్నారని తెలుస్తోంది.