హిందీలో దుమ్మురేపుతున్న కార్తికేయ-2..ఏకంగా 700 థియేటర్స్ లో

0
126

చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమే ‘కార్తికేయ 2’. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘కార్తికేయ’ మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఫ్రాంచైజీగా రూపొందించారు కార్తికేయ 2. ద్వారక రహస్యాన్ని చేధించే కథాంశంతో తెరెకక్కిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్​.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈనెల 13న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల అయింది. ఈ చిత్రం సక్సెస్ఫుల్ గా ప్రదర్శితమవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను కూడా  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా..నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడారు.

ఈ సినిమాను హిందీలో సరదాగా రిలీజ్ చేద్దామని 50 థియేటర్స్ లలో విడుదల చేస్తే అది రెండో రోజుకు 200 థియేటర్స్ అయింది. ప్రస్తుతం 700 థియేటర్స్ లలో ఆడుతుంది. అంటే ఇవాళ భాష అని భారీకేడ్లను దాటుకొని ప్రజల గుండెల్లోకి వెళ్ళింది, అంటే సినిమాలో సత్తా లేకుంటే అలా జరగదు కదా. ఇలా అన్ని థియేటర్స్ లలో ఆడదు కదా. కాబట్టి ఈ సినిమా ఇంకా పెద్ద విజయం సాధించాలి” అని తెలిపారు.