కార్తికేయ-3 పై యంగ్ హీరో నిఖిల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

0
106

యంగ్ హీరో నిఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఇటీవలే రిలీజ్ అయినా కార్తికేయ-2 తో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడో మనందరికీ తెలిసిన విషయమే. కార్తికేయ-2 లో హీరో నిఖిల్ తనదైన శైలిలో నటించి విశేష ప్రేక్షకాధారణ సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రానికి డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించగా..నిఖిల్ సరసన అనుపమపరమేశ్వరన్ నటించింది.

ఈ సినిమా కలెక్షన్ల పరంగా రూ.100 పైగా వసూల్ చేసి తమ ఖాతాల్లో వేసుకున్నారు. కేవలం కార్తికేయ-2 నే కాకుండా మొదటి పార్ట్ కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో  ఫిదా అయినా ప్రేక్షకులు కార్తికేయ-3 కూడా రావాలని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయమై హీరో నిఖిల్ క్లారిటీ ఇచ్చాడు.

త్వరలో కార్తికేయ-3 సినిమాని కూడా ప్రారంభిస్తామని నిఖిల్ ఈ మేరకు తెలియజేసాడు. కానీ ఈ సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తారు అనే విషయంపై మాత్రం హీరో నిఖిల్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. కార్తికేయ -3 ని 3D లో రూపొందించబోతున్నట్లు సమాచారం.