కార్తికేయా కొత్త ప్రాజెక్టు ప్రారంభం

కార్తికేయా కొత్త ప్రాజెక్టు ప్రారంభం

0
93

’ఆర్ ఎక్స్ 100’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు కార్తికేయా. ఈ సినిమా ఘన విజయం సాదించింది. దీంతో కార్తికేయ నుంచి వరుస సినిమాలు వస్తున్నాయి. కానీ అవి ఆశించిన స్థాయిని అందుకోలేకపోయాయి. దీంతో కార్తికేయతో పాటు ఆయన అభిమానులను నిరాశ పరిచాయి సినిమాలు . ఈ నేపథ్యంలో కార్తికేయ మరో కొత్త ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

’ఆర్ ఎక్స్100’ చ్రితాన్ని నిర్మించిన అశోక్ రెడ్డి గుమ్మకొండ కార్తికేయ కొత్త సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఇది కార్తికేయ సొంత బ్యానర్ అనుకోవాలి. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు శేఖర్ రెడ్డి . ఇంకా ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేయలేదు. ఈ నెల 9వ తేదీన టైటిల్ తో కూడిన ఫస్టులుక్ ను విడుదల చేయనున్నట్టు తెలియజేశారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందివ్వనున్నారు. ఈ సినిమా మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.