కాశికి వెళ్లేందుకు అవ‌కాశం లేదు రిషి కపూర్ అస్థికలను ఏం చేశారంటే

కాశికి వెళ్లేందుకు అవ‌కాశం లేదు రిషి కపూర్ అస్థికలను ఏం చేశారంటే

0
87

రిషి కపూర్ మ‌ర‌ణం ఎవ‌రూ జీర్ణించుకోలేక పోతున్నారు, ఆయ‌న కుటుంబం క‌న్నీరు మున్నీరు అవుతోంది, ఇంత‌లాంటి వ్య‌క్తి ఇక లేరు అంటే త‌ట్టుకోలేక‌పోతోంది బీటౌన్, అయితే రిషి కపూర్ అస్థికలను ఆయన భార్య నీతూ కపూర్, కుమారుడు రణబీర్ కపూర్ ముంబైలోని బన్గంగా తలాల్ (చెరువు)లో ఈరోజు నిమజ్జనం చేశారు.

అయితే అస‌లు ఇక్క‌డ కాకుండా ఆయ‌న అస్తిక‌లు హ‌రిద్వార్ లో క‌ల‌పాలి అని అనుకున్నారు, కాని లాక్ డౌన్ వేళ అది కుద‌ర‌క‌పోవ‌డంతో ఈ ప‌ని చేశారు కుటుంబ స‌భ్యులు, వీరితో పాటు రణబీర్ కపూర్ ప్రియురాలు, సినీనటి అలియా భట్ కూడా అక్క‌డ కార్య‌క్ర‌మానికి హ‌జర‌య్యారు.

రిషి సోదరుడు రణధీర్ కపూర్ ఈ కార్య‌క్ర‌మం గురించి చెప్పారు, త‌మ కుటుంబం నుంచి మా సోద‌రుడు వెళ్లిపోయారు, ఆయ‌న చివ‌రి కార్య‌క్ర‌మాలు పూర్తి అయ్యాయి, కాని లాక్ డౌన్ వల్ల హ‌రిద్వార్ వెళ్ల‌డం కుద‌ర‌క ముంబైలోనే బన్గంగాలో అస్థికలను కలిపామని తెలిపారు. అంతా హిందూ సంప్రదాయాల ప్రకారం అన్ని పూజలను నిర్వహించారు.