కత్తి మహేష్ కు డబ్బులు పంపిస్తున్న పవన్ ఫ్యాన్స్

కత్తి మహేష్ కు డబ్బులు పంపిస్తున్న పవన్ ఫ్యాన్స్

0
107

సినీ క్రిటిక్ కత్తి మహేష్ కు పవన్ కల్యాణ్ అభిమానులకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అనే విషయం తెలిసిందే, చాలా విషయాల్లో పవన్ ని కత్తి విమర్శిస్తారు అని పవన్ ఫ్యాన్స్ ఆరోపణలు చేస్తూ ఉంటారు, ఇక పవన్ అభిమానులకు కత్తి మహేష్ కు పెద్ద వార్ జరిగింది అని చెప్పాలి, అయినా సందర్భం బట్టీ రాజకీయంగా కొన్ని విషయాలలో పవన్ పై విమర్శలు ఆరోపణలు చేస్తారు కత్తి మహేష్.

సోషల్ మీడియాలో కత్తిపై కామెంట్లు చేసే పవన్ అభిమానులు తాజాగా పందా మార్చారు.. చిల్లర డబ్బులు తీసుకుని వైసీపీ దగ్గర డబ్బులు తీసుకుని ఇలా పవన్ పై కామెంట్లు విమర్శలు చేస్తున్నారు అని పవన్ అభిమానులు విమర్శలు చేస్తారు, తాజాగా వీరు కూడా ఇలా చిల్లర నగదు రూపాయి 5 రూపాయలు పంపిస్తూ తమ నిరసన చేస్తున్నారు, దీనికి కత్తి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

తనకు చిల్లర డబ్బులు కాదని, ఆ పంపేదేదో, రూ. 100 లేక రూ. 1,000 పంపాలంటూ సటైరిక్ గా తెలిపారు. అయ్యా పవన్ కళ్యాణ్ అభిమానులూ నా గూగుల్ పే నంబర్. నా బ్యాంకు అకౌంట్ వివరాలు తెలుసుకుని నాకు 1 రూపాయి. 5 రూపాయలు పంపిస్తున్నారు. మీ ఉద్దేశం ఏమైనా గానీ.. సంతోషం. కానీ, పెరిగిన ద్రవ్యోల్బణం మరియు నా ఖర్చుల దృష్ట్యా ఆ పంపేదేదో 100 రూపాయలో, 1000 రూపాయలో పంపితే, కనీసం నా మందులో మంచింగ్ ఖర్చుకు పనికొస్తుంది. మీ పవర్ స్టార్ మానంమర్యాదలు నిలబడతాయి. ధన్యవాదాలు. ఇట్లు.. మీ చిల్లర అభిమానానికి పాత్రుడు.. కత్తి మహేష్ అని పోస్ట్ పెట్టారు, అయితే దీనిపై పవన్ అభిమానులు కాస్త భిన్నంగా స్పందిస్తున్నారు.