కత్రినా కైఫ్ తో ఆ హీరో డేటింగ్ నిజమే..!

Katrina Kaif dating with Bolly wood hero Vicky Kaushal

0
104

ముంబయి : అవును కత్రినా కైఫ్ తో హీరో విక్కీ కౌశల్ డేటింగ్ లో ఉన్న మాట నిజమే అని బాంబు పేల్చారు బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ కుమారుడు, హీరో హర్షవర్ధన్. ఇటీవల ఒక ఇంటర్య్యూ ఇచ్చిన హర్షవర్ధన్ ఈ విషయాన్ని వెల్లడించారు. బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ డేటింగ్ గురించి వస్తున్న వార్తలపై స్పందించారు. మీరు నిజమని నమ్ముతున్న ఒక బాలీవుడ్ ప్రేమ జంట గురించి చెప్పగలరా అని విలేకరి ప్రశ్నించగా… ‘‘విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు.. అది నిజం.. ఒకవేళ ఈ విషయాన్ని వెల్లడించడం ద్వారా నాకేమైనా ఇబ్బందులు వస్తాయేమో? నాకు తెలియదు’’ అంటూ హర్ష కామెంట్ చేశారు. అయినా తమ మధ్య ఉన్న సంబంధం గురించి వారిద్దరూ ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పేశారుగా అని వివరణ ఇచ్చారు కూడా.

కత్రినా, విక్కీ కౌశల్ గత కొన్ని సంవత్సరాల నుంచి స్నేహితులుగా ఉన్నారు. బాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో జరిగే ఫంక్షన్లకు వీరిద్దరూ కలిసే వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గడిచిన రెండేళ్ల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై స్పందించాలంటూ విక్కీ అడగ్గా.. వ్యక్తిగత జీవితం గురించి బయటపెట్టడం తనకు అంతగా ఇష్టం లేదని మాట దాటవేశారు. ఇక కత్రినా కైఫ్ వీళ్ల బంధం గురించి ఏనాడూ నోరు విప్పిన పరిస్థితి మాత్రం లేదనే చెప్పాలి. విక్కీ కౌశల్ తాజాగా కత్రినా ఇంటికి కూడ వెళ్లివచ్చారు. ఆయన 6 గంటల పాటు ఆమె కుటుంబసభ్యులతో గడిపారు. మరి ఈ ప్రేమాయణం ఎటువైపు దారితీస్తుందో…