సినీ క్రిటిక్, నటుడు నిత్యం వార్తల్లో వినిపించే కత్తి మహేష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు, అయితే
హిందువులు ఆరాధించే శ్రీరాముడిపై ఫేస్ బుక్ లో అసభ్య కామెంట్లను పోస్ట్ చేశారంటూ గతంలో కత్తి మహేశ్ పై హిందూ సంస్థలతో పాటు పలువురు వ్యక్తులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈకేసు ఇంకా నడుస్తున్న విషయం తెలిసిందే.
ఈ కేసులో భాగంగా నేడు సైబర్ క్రైమ్ పోలీసులు కత్తి మహేష్ ని అరెస్ట్ చేశారు..ఇక కేసు విచారణలో భాగంగా, ఆ పోస్టులను మహేశ్ పోస్ట్ చేశారని నిర్ధారించారు పోలీసులు, దీంతో ఈ కేసులో కత్తి మహేష్ తో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు.
వారికి ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలను నిర్వహించి, హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. మహేశ్ పై 2018 నుంచి సైబర్ క్రైమ్ స్టేషన్ లో దాదాపు 5 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు అరెస్ట్ తో మళ్లీ మహేష్ వార్తల్లో నిలిచాడు.