కత్తిమహేష్ పేరు చెబితే సెన్సేషన్ ని తనకు తాను క్రియేట్ చేసుకునే వ్యక్తి అని చెబుతారు. అయితే పవన్ కల్యాణ్ ని ఎప్పుడైతే కత్తి మహేష్ టార్గెట్ చేశారో అప్పటి నుంచి కత్తి మహేష్ కు టాలీవుడ్ లో పవన్ అభిమానులకు అగాధం పెరిగిపోయింది. పవన్ ని విమర్శించి తనకు మైలేజ్ పెంచుకుంటున్నాడు కత్తి అనేలా పవన్ అభిమానులు కామెంట్లుచేసేవారు, ఇక ఎన్నికల సమయంలో పవన్ పై అనేక విమర్శలు చేశాడు కత్తి మహేష్.
అయితే కత్తి మహేష్ ఎన్నికల్లో పవన్ ఓటమి తర్వాత సోషల్ మీడియాలో మరీ దారుణంగా కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. అయితే పవన్ కల్యాణ్ పై తాజాగా పెట్టిన పోస్టు మాత్రం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్ విశాఖ లో తన పార్టీ నేతలతో, కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని జగన్ రెడ్డి అని సంభోదించారు, అంతేకాదు రాజధాని అంశం గురించి కూడా మాట్లాడారు, పులివెందులలో రాజధానిని, కర్నూలులో హైకోర్టు పెట్టుకోమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్కు సలహా ఇచ్చారు. దీనిపై కత్తి మహేష్ పవన్ కు పంచ్ ఇచ్చారు.
ఏరా పవన్ కళ్యాణ్. పులివెందులలో రాజధాని, కర్నూలులో హైకోర్టు పెట్టుకోమని ఏకసెక్కలాడతావా? న్యాయబద్ధంగా రాయలసీమ ప్రజల హక్కులురా అవి పుండాకోర్! నీకు అది మజాక్ గా అనిపిస్తోందా? మళ్ళీ గుండు కావాలని కోరిక ఏమైనా కలుగుతోందా నీకు! ఖబడ్దార్ అని ఆయన ఫేస్బుక్లో కత్తి మహేష్ ఒక పోస్టు చేశారు.. దీనిపై పవన్ కల్యాణ్ అభిమానులు కత్తిపై మళ్లీ సటైర్ల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు సీఎం జగన్ సర్కారు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడితే అరెస్టు తప్పదు అని చెబుతోంది. ఇప్పుడు కత్తి మహేష్ కూడా పవన్ ని వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడని ఆయనపై కేసులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నామని సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తున్నారు పవన్ అభిమానులు.