బాలయ్య సినిమాకి కీర్తి సురేశ్ నో కార‌ణం ఇదే

బాలయ్య సినిమాకి కీర్తి సురేశ్ నో కార‌ణం ఇదే

0
87

బాల‌కృష్ణ కథానాయకుడిగా బోయ‌పాటి ఓ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు, అయితే ఈ చిత్రం ఇక చ‌కా ప‌నులు పూర్తి చేసుకుంటుంది. ఇక ఈ సినిమాలో క‌థ‌నాయిక‌గా ముందు నుంచి న‌య‌న‌తార‌ని అనుకున్నారు, అయితే ఆమెకి ప‌లు క‌మిట్మెంట్స్ ఉన్నాయి.. దీంతో ఆమె ఈ చిత్రంలో న‌టించ‌డం లేద‌ట‌.

ఇక శ్రీయ‌ని తీసుకున్నారు, అయితే మ‌రో న‌టి కూడా చిత్రంలో అవ‌స‌రం ఉంది అని తెలుస్తోంది, అందుకే కీర్తి సురేష్ ని మ‌రో పాత్ర కోసం చూశార‌ట‌, అయితే ఆమె డేట్స్ లేక‌పోవ‌డంతో ఈ సినిమాలో ఛాన్స్ వ‌ద్ద‌ని చెప్పింది అని తెలుస్తోంది.

ఆ సమయంలోనే కేథరిన్ ను సంప్రదించగా, భారీ పారితోషికాన్ని అడిగిందట. అప్పుడే అంజలి పేరును పరిశీలించి ఓకే చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో డిక్టేటర్ చిత్రంలో బాలకృష్ణకి జోడీగా అంజలి కనిపించింది. అయితే గతంలో జోడి బాగానే ఉంది మాస్ ప్రేక్షకుల‌ని బాగా ఆక‌ట్టుకుంది సో చూడాలి మ‌రి వీరిద్ద‌రి తో ఈ చిత్రం ఎలా ఉంటుందో.