కేజీఎఫ్ 2 లో పాత్ర వదులుకున్న రమ్యకృష్ణ కారణం ఇదేనా

కేజీఎఫ్ 2 లో పాత్ర వదులుకున్న రమ్యకృష్ణ కారణం ఇదేనా

0
96

రమ్యకృష్ణకు ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది… ఆమెకు బాహుబలి సినిమాతో మరింత క్రేజ్ వచ్చింది.. శివగామి పాత్రతో ఆమె చిత్రం లో బెస్ట్ రోల్ చేశారు అని అందరూ ప్రశంసించారు.. ఆమె నటనకు అనేక అవార్డులు వచ్చాయి. అందుకే కొత్తగా సినిమాలు చేస్తున్న దర్శకులు పవర్ఫుల్ పాత్ర ఏదైనా వుంటే ముందుగా ఆమెనే సంప్రదిస్తున్నారు.

తాజాగా కేజీఎఫ్ 2 చిత్రీకరణ శరవేగంగా పూర్తి అవుతోంది.. అన్నీ భాషల్లో ఈ సినిమా పార్ట్ 1 హిట్ అవడంతో , సీనియర్ తారాగణం తీసుకోవాలి అని చిత్ర దర్శకుడు భావిస్తున్నారు… తాజాగా కేజీఎఫ్ 2 సినిమాలో లేడీ పీఎమ్ పాత్రకి గాను రమ్యకృష్ణను అడిగారట. అయితే ఆమె సినిమాలో చేయడానికి ఒకే చెప్పారు.. కాని రెమ్యునరేషన్ భారీగా అడిగారు అని తెలుస్తోంది.

ఇక ఆమెని కాదు అని రవీనా టాండన్ ను తీసుకున్నారట. యష్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా సంజయ్ దత్ కనిపించనున్నాడు. ఒక ముఖ్యమైన పాత్రను రావు రమేశ్ పోషిస్తున్నాడు. అయితే ఆమె బిజీగా ఉండటంతో ఈ చిత్రం కూడా వదులుకున్నారు అని మరో వార్త వినిపిస్తోంది.