కన్నడ స్టార్ యశ్ తాజా చిత్రం ‘కేజీఎఫ్’. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా పార్ట్ 2 గతేడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణంగా అనేక పర్యాయాలు వాయిదా పడింది. శనివారం యశ్ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రబృందం స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చింది.
‘కేజీఎఫ్-2’ సరికొత్త పోస్టర్ విడుదల చేసింది. “గమనిక: ప్రమాదం ముందుంది” అని పేర్కొంటూ షేర్ చేసిన ఈ పోస్టర్‌లో ఏప్రిల్ 14నే చిత్రాన్ని విడుదల చేస్తామని మరోసారి అధికారికంగా ప్రకటించింది. విడుదల తేదీలో ఎలాంటి మార్పులు లేకపోవడం వల్ల సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రానికి ప్రశాంత్‌నీల్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ‘అధీరా’ పాత్రలో ఆయన ప్రేక్షకుల్ని అలరించనున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్, టాలీవుడ్ నటుడు రావు రమేష్, ప్రకాశ్‌రాజ్ కీలకపాత్రలు పోషించారు.