‘కేజీఎఫ్‌- చాప్టర్‌ 1’ సంచలనం..స్పెషల్​ వీడియో రిలీజ్

'KGF-Chapter 1' Sensation..Special Video Release

0
115

కన్నడ స్టార్​ హీరో యశ్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘కేజీఎఫ్‌’. ఈ చిత్రం తొలి పార్ట్‌ ‘కేజీఎఫ్‌- చాప్టర్‌ 1’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2018లో ఇదే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా భారీ విజయాన్ని సాధించింది. ‘కేజీఎఫ్‌- చాప్టర్‌ 1’ విడుదలై నేటికి మూడేళ్లయిన నేపథ్యంలో చిత్రబృందం ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.

ఈ వీడియోలో ‘కేజీఎఫ్‌ చాప్టర్‌-1’ విడుదల తేదీ ప్రకటన దగ్గర నుంచి ‘కేజీఎఫ్‌- చాప్టర్‌2’ విడుదల తేదీ ప్రకటన వరకు చిత్రబృందం చేసిన ప్రయాణాన్ని చూపించారు. అంతేకాదు.. థియేటర్లలో సందడి, చిత్రీకరణ, చిత్రంపై ప్రముఖుల అభిప్రాయం, ప్రేక్షకుల స్పందనలను వీడియో ద్వారా మరోసారి గుర్తు చేశారు.

ఇప్పటికీ మన చుట్టూ ఈలలు, అరుపులు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఈ చిత్రాన్ని తమ చిత్రంగా ఆదరించిన అభిమానులందరికీ రుణపడి ఉంటాం. ఈ అభిమానమే ‘కేజీఎఫ్‌- చాప్టర్‌ 2’ను తెరకెక్కించడానికి ఇంధనంగా మారింది” అని చిత్రబృందం పేర్కొంది. ‘కేజీఎఫ్‌- చాప్టర్‌ 2’ను ఏప్రిల్‌ 14, 2022న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు నిర్మాణ సంస్థ హోంబలే ఇటీవల ప్రకటించింది.