కెజిఎఫ్-2 మూవీ రివ్యూ..

0
76

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రాకింగ్ స్టార్ యష్ నటించిన తాజా చిత్రం కెజిఎఫ్ 2. ఇప్పటికే సినీ ప్రపంచంలో ఓ ట్రెండ్‌ సెట్‌ చేసింది కేజీఎఫ్ -1. అయితే కెజిఎఫ్ 2 సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూసిన సంగతి తెలిసిందే.

ఎట్టకేలకు గురువారం రోజు  ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలయి ప్రేక్షకులకు పూనకాలు వచ్చేలా చేసింది. ఈ సినిమా చుసిన ప్రేక్షకులు బ్లాక్ బాస్టర్ గా ఉందని హీరో యాశ్ ను పొగడ్తలతో మెచ్చుకుంటున్నారు. హీరో యాశ్ ఎంట్రెన్స్ కు, హీరో యాశ్ ఫైట్ కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే అన్నట్టుగా ఉంది సినిమా.

సెకండ్ పార్ట్ లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ సంజ‌య్ ద‌త్ అనే చెప్పాలి. మధ్యలో స్టోరీ కొంత స్లో గా ఉన్న అందులో నటించిన ప్రతి ఒక్కరి క్యారెక్టర్ తో  ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా చేశాయని చెప్పడంలో సందేహిమేమి లేదు. అమ్మ సెంటిమెంట్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది.