కేజీఎఫ్ లాంటి మాస్ సినిమాతో దేశ మొత్తం తనవైపు చూసేలా చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్. దానికి సీక్వెల్ తీసిన ఆయన..ప్రస్తుతం ప్రభాస్‌తో యాక్షన్ డ్రామా ‘సలార్’ చేస్తున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌తోనూ సినిమా చేయనున్నారు. దసరా రోజు ప్రశాంత్‌నీల్..రామ్‌చరణ్- మెగాస్టార్ చిరంజీవిని కలవడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది.
ఈ ఫొటోలను రామ్‌చరణ్, ప్రశాంత్ నీల్..తమ తమ ట్విట్టర్ ఖాతాల్లో పోస్ట్ చేయడం వల్ల అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. చరణ్‌తో నీల్ సినిమా చేయడం పక్కా అని మాట్లాడేసుకుంటున్నారు. మరి వీరిద్దరూ చిరు ఇంట్లో ఏర్పాటు చేసిన పార్టీలో కలిసినప్పటికీ, భవిష్యత్తులో ఈ కాంబినేషన్లో సినిమా చూసే అవకాశమైతే లేకపోలేదు. ఒకవేళ వస్తే మాత్రం బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోతే!
ఆర్ఆర్ఆర్’తో రిలీజ్‌కు సిద్ధమైన రామ్‌చరణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తారు. నవంబరు నుంచి షూటింగ్ మొదలవుతుంది. ఆ తర్వాత ‘జెర్సీ’ ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో కలిసి పని చేస్తారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రకటన దసరా కానుకగా వచ్చింది.