కేజీఎఫ్ 2 దర్శకుడి తర్వాత సినిమా టాలీవుడ్ హీరోతోనేనట..!!

కేజీఎఫ్ 2 దర్శకుడి తర్వాత సినిమా టాలీవుడ్ హీరోతోనేనట..!!

0
124

కెజిఎఫ్ సినిమా తో దేశం మొత్తం తెలిసిన డైరెక్టర్ పేరు ప్రశాంత్.. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో చాలామంది స్టార్ హీరోలు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు.. ఈ లిస్ట్ లో మహేష్ బాబు కూడా చేరిపోయాడు..

ఇటీవలే సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్న మహేష్ ని కాంటాక్ట్ అవ్వడానికి ప్రశాంత్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.తన దగ్గర ఉన్న మరో బిగ్ ప్రాజెక్ట్ ప్లాన్ గురించి మహేష్ తో డిస్కస్ చేయడానికి వెయిట్ చేస్తున్నాడట. మహేష్ కూడా సక్సెస్ ఫుల్ దర్శకుడు కాబట్టి కథ వినేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.

కథ నచ్చితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ తరువాత KGF2 అయిపోగానే మహేష్ తో వచ్చే ఏడాది కొత్త మూవీ స్టార్ట్ చేయాలనీ ప్రశాంత్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి మహేష్ కి ప్రశాంత్ నీల్ స్టోరీ నచ్చుతుందో లేదో చూడాలి.