కేజీఎఫ్ ఈ సినిమా చూసిన వెంటనే ఈ స్టోరీ రాసిన డైరెక్టర్ ఎవరు అసలు దర్శకుడు ఎవరు అని అందరూ తెలుసుకోవడం మొదలు పెట్టారు …అతనే ప్రశాంత్ నీల్ , సూపర్ సినిమా సౌత్ ఇండియాలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది బాహుబలి లాంటి రేంజ్ సంపాదించిందిఈ కేజీఎఫ్ సినిమా.
హీరోను చూపించడంలో అతడికి ఎవరూ సాటిలేరని నిరూపించుకున్నాడు. కేజీఎఫ్2 చిత్రీకరణలో ప్రస్తుతం ప్రశాంత్ బిజీగా ఉన్నాడు, ఈ సినిమా కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది, ఇక వచ్చే ఏడాది ఈ చిత్రం రానుంది, అయితే ఇప్పుడు తన తరువాత సినిమాపై ఫోకస్ చేశాడు ప్రశాంత్ నీల్.
ఇక చాలా మంది టాలీవుడ్ హీరోలు కూడా అతనితో సినిమా చేయాలి అని చూస్తున్నారు, అంతేకాదు నిర్మాణ సంస్ధ మైత్రీ కూడా ఆయనతో ఓ సినిమా చేయాలి అని ఫిక్స్ అయింది, గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్తో ప్రశాంత్ ఓ సినిమా తీయనున్నాడని వార్తలు వచ్చాయి, అయితే తాజాగా మరో వార్త వినిపిస్తోంది.
ప్రశాంత్ తన తరువాతి సినిమాను టాలీవుడ్ హీరోలు ప్రభాస్ లేదా ఎన్టీఆర్తో చేసే అవకాశం ఉంది అని ఓ సినిమా క్రిటిక్ ట్వీట్ పెట్టారు, దీంతో ఇదే చర్చ జరుగుతోంది.. బహుశా ఆదిపురుష్ నాగ్ అశ్విన్ సినిమా అయ్యాక ప్రభాస్ ఫ్రీ అవుతారు, అలాగే ఇటు ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమా అవ్వాలి అప్పుడు తారక్ ఫ్రీ అవుతారు. సో చూడాలి తర్వాత వీరిద్దరిలో ఎవరితో సినిమా ఉంటుందో.