కేజీఎఫ్ మరో రికార్డు దేశంలో టాప్

కేజీఎఫ్ మరో రికార్డు దేశంలో టాప్

0
111

సినిమా ఇండస్ట్రీలో చాలా రికార్డులు చెరిపివేసి ఓ చరిత్ర నమోదు చేసిన చిత్రం అంటే కేజీఎఫ్ అనే చెప్పాలి. ఇప్పటికీ డిజిటల్ మీడియాలో ఈ సినిమా ఓ విప్లవం అనే చెప్పాలి…2018 చివర్లో వచ్చిన ఈ చిత్రం చరిత్ర అంటారు సినిమా అభిమానులు.

హీరో యష్ కూడా అసలు పరిచయం ఫేమ్ లేని హీరో. కాని స్టోరీ మాత్రం చాలా బలమైన స్టోరీ , దీంతో ఈ సినిమా అదిరిపోయే రికార్డులు నమోదు చేసింది… అయితే యష్ చాలా మందికిి తెలియదు, కేవలం కన్నడ ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. అలాంటి యష్ సినిమా అన్నీ భాషల్లో రిలీజ్ అయి బ్లాక్ బ్లాస్టర్ హిట్ అయింది.

హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్ మలయాళ భాషలలో కేజీఎఫ్ విడుదలై విశేష ఆదరణ దక్కించుకుంది.
2019 సంవత్సరానికి గాను అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన చిత్రాలలో అన్ని భాషలలో అత్యధికంగా వీక్షించిన సినిమాగా కేజిఎఫ్ నిలిచింది. ఇప్పటికీ అందులో యష్ నటనకు అందరూ అభిమానులే, రోజూ ఈ సినిమా చూసే వారు కూడా ఉన్నారు అంటే ఆశ్చర్యపోవక్కర్లేదు. . ఇక కేజిఎఫ్ చాప్టర్ 2 ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలకానుంది.