కెజిఎఫ్ మ్యూజిక్ డైరక్టర్ రోజుకి 35 రూపాయల సంపాద‌న ఏ ప‌ని చేస్తున్నారంటే

కెజిఎఫ్ మ్యూజిక్ డైరక్టర్ రోజుకి 35 రూపాయల సంపాద‌న ఏ ప‌ని చేస్తున్నారంటే

0
217

క‌ష్ట‌ప‌డే వాడు ఎక్క‌డైనా రారాజే… అలాగే త‌మ కుల‌వృత్తిని న‌మ్మేవాడు జీవితంలో పైకి వ‌స్తాడు, అంతేనా త‌న తండ్రి అదే క‌ష్టం చేసి న‌న్ను ఇంత స్ధాయికి తీసుకువ‌చ్చాడు అని ఆ వృత్తిని మ‌రిచిపోని పిల్ల‌లు ఉంటారు, ఇలా ఆ వృత్తిని మ‌ర్చిపోలేని వారు చాలా మంది ఉంటారు. అలాంటి వారికి చేతులెత్తి మొక్కాలి.

కెజిఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ లాక్ డౌన్ టైం లో తన సొంత ఊరు వెళ్లి తన తండ్రితో పాటుగా దేవుళ్ళకు ఆభరణాలు తయారుచేసే పనిలో ఉన్నాడట. కెజిఎఫ్ సినిమాకు మ్యూజిక్ అందించిన రవి బస్రూర్ లాక్ డౌన్ వల్ల తన సొంత ఊరు ఉడిపి దగ్గర కుందాపూర్ వెళ్లారు, రవి తండ్రికి సాయం చేస్తూ దేవుళ్ళ ఆభరణాలు తయారు చేస్తున్నాడట.

ఇంత క‌ష్ట‌ప‌డినా అత‌నికి రోజూ వ‌చ్చేది 35 రూపాయ‌ల కూలీ మాత్ర‌మే. కెజిఎఫ్ లాంటి సూపర్ హిట్ సినిమా తీసి కోట్లల్లో రెమ్యూనరేషన్ తీసుకున్నా ఇలా తండ్రికి సాయపడుతూ 35 రూపాయలు సంపాదించడంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు రవి, ఇక కేజీఎఫ్ 2 కి కూడా ఆయ‌నే మ్యూజిక్ అందిస్తున్నారు, కాని లాక్ డౌన్ నేప‌థ్యంలో సొంత ఊరుకి వ‌చ్చాడు ర‌వి.