కేజీఎఫ్ 2 పై క్రేజీ టాక్ – ఏమిటంటే

కేజీఎఫ్ 2 పై క్రేజీ టాక్ - ఏమిటంటే

0
89

కేజీఎఫ్ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే.. ఈ సినిమా కన్నడ హీరో యశ్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. అందరికి ఈ సినిమా ఎంతగానో నచ్చింది, అయితే ఇప్పుడు ప్రస్తుతం కేజీఎఫ్ చిత్రం 2 తెరకెక్కుతోంది..కేజీఎఫ్ 2 షూటింగ్ ఇప్పటికే చివరిదశకు చేరుకున్న క్రమంలో ఓవార్త ఫిలిం సర్కిల్ లో వైరల్ అవుతోంది.

 

ఈ సీక్వెల్ పై పెద్ద ఎత్తున అంచనాలున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ కోసం ఆడియన్స్ అలాగే ఈ సినిమా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు…ఇక బాహుబలి 2 కోసం ఎంత అలా ఎదురుచూశారో ఈ సినిమా కోసం అంతే ఆతృతగా అందరూ చూస్తున్నారు.

 

ఈ సినిమాలో శ్రీనిధిశెట్టి హీరోయిన్ గా చేస్తుంది.. సెకండ్ చాప్టర్ లో ఐటెమ్ సాంగ్ ఉండేలా కథను డిజైన్ చేశారట ..బాలీవుడ్ హాట్ బ్యూటీస్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహి ని సంప్రదించారని వార్తలు వస్తున్నాయి… వీరిలో ఒకరు మాత్రం ఈ సాంగ్ చేస్తారు అని టాక్ నడుస్తోంది చిత్ర సీమలో.