Kiccha Sudeep Hebbuli movie: కన్నడ హీరో కిచ్చా సుదీప్ ఈగ మూవీ తో టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ మూవీ నుండి తెలుగు రాష్ట్రాల్లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. తాజాగా, సుదీప్, అమలాపాల్ కలిసి నటించిన చిత్రం ‘హెబ్బులి’. సీఎంబీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎమ్.మోహన శివకుమార్ సమర్పణలో సి.సుబ్రహ్మణ్యం నిర్మించిన చిత్రానికి ఎస్.కృష్ణ దర్శకత్వం వహించారు. ఇప్పటికే కన్నడలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా.. తెలుగులో డబ్బింగ్, సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. వి.రవిచంద్రన్, పి.రవిశంకర్, కబీర్ దుహన్ సింగ్, రవి కిషన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాలో సంపత్ రాజ్ నెగిటివ్ రోల్ పోషించాడు. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, రొమాంటిక్ యాంగిల్‌తో కూడిన చిత్రానికి అర్జున్ జన్య సంగీతం అందించాడు.
Kiccha Sudeep: సుదీప్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. విడుదలకి సిద్ధంగా ‘హెబ్బులి’
-