టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒక్క విషయం నిరూపిస్తే తాను సినిమాలను చేయడం మానుకుంటానంటూ ఛాలెంజ్ చేశారు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం.. ‘క(KA)’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. సుజిత్(Sujeeth), సందీప్(Sandeep JL) సంయుక్తంగా డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 31న దీపావళి స్పెషల్‌గా థియేటర్స్‌లోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా కిరణ్ నటించిన తొలి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే కావడంతో మూవీ టీమ్ అంతా చాలా ఎక్సైటెడ్‌గా ప్రమోషన్స్ చేసేస్తోంది. వీటిలో భాగంగానే అందరికీ కిరణ్ ఒక ఛాలెంజ్ విసిరాడు.
‘‘ఈ సినిమా ఎన్నడూ రాని సరికొత్త కథతో తెరకెక్కింది. ఇలాంటి సినిమాను మునుపెన్నడూ చూసి ఉండరు. ఎవరూ ఇప్పటి వరకు ఇలాంటి లైన్‌తో సినిమా చేయలేదు కూడా. ఒకవేళ అలా కాదు.. ఇది వరకే ఇలాంటి సినిమా వచ్చింది అని నిరూపించండి.. నేను సినిమాలు చేయడం మానేస్తా. ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతా’’ అని Kiran Abbavaram చెప్పుకొచ్చాడు. ఈ మాటలతో సినిమాపై తనకు ఎంత నమ్మకం ఉందో తెలుపుతోంది.అంతేకాక ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి అనుకున్నంత స్థాయిలో ‘క’ అదరగొట్టుద్దో లేదో చూడాలి.