Kiran Abbavaram | ఫ్యాన్స్‌తో యంగ్ హీరో బెట్.. ప్రైజ్ ఏంటో తెలుసా?

-

టాలీవుడ్‌లోని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) పేరు తప్పకుండా ఉంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇటీవల ‘క’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో హిట్ అందుకున్న కిరణ్ ఇప్పుడు ‘దిల్ రుబా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నవాడు. తాజాగా ఈ సినిమా విషయంలో ప్రేక్షకులతో కిరణ్ కిర్రాక్ బెట్ కాశాడు. కిరణ్ కాసిన పందెంతో ప్రేక్షకులు, అభిమానుల్లో నూతనోత్సాహం పరవళ్లు తొక్కడం ప్రారంభించింది.

- Advertisement -

తన బెట్‌ను చెప్తూ కిరణ్(Kiran Abbavaram) విడుదల చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ బెట్‌లో గెలిచిన వారికి అదిరిపోయే గిఫ్ట్‌ కూడా ఇస్తానన్నాడు యంగ్ హీరో. దీంతో ఈ బెట్ కాస్తా మరింత రసవత్తరంగా మారింది. ఇంతకీ ఆ బెట్ ఏంటో తెలుసా.. ఈ సినిమా కథను గెస్ చేయడం. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కిరణ్.. ఓ వీడియోను రిలీజ్ చేశాడు.

అందులో ఏముందంటే.. ‘‘నా కోసం, ప్రేమల సమ్మెళనమే ‘దిల్ రూబా’. ఈ బైక్(Dilruba) అంటే నాకు చాలా ఇష్టం. మా ఆర్ట్ డైరెక్టర్ ఎంతో కష్టపడి సినిమా కోసం దీనిని తయారు చేశారు. మార్కెట్‌లో ఇది మీకు ఎక్కడా దొరకదు. అందుకే దీనిని మీకే గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నా. ఈ బైక్‌ను సొంతం చేసుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్, టీజర్‌, ప్రమోషన్స్‌లో మేము మాట్లాడిన విషయాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా ప్లాట్‌ను గెస్ చేయడమే. కథను కరెక్ట్‌గా ఎవరైతే గెస్ చేస్తారో.. వారికి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఈ బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చేస్తా. అంతేకాకుండా ఈ బైక్ గెలుచుకున్న వారితో ఇదే బైక్‌పై ఫస్ట్ డే ఫస్ట్‌షోకు కూడా వెళ్తా’’ అని బంపర్ ఆఫర్ ఇచ్చాడు కిరణ్. మరి ఆ లక్కీ విన్నర్ ఎవరో తెలియాలంటే ప్రీరిలీజ్ ఈవెంట్ వరకు ఆగాల్సిందే. అయితే ‘దిల్ రూబా’ సినిమా మార్చి 14న విడుదల కానుంది.

Read Also: దానిమ్మతో గంపెడు ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటంటే..!
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...