రివ్యూ : కిరోసిన్

-

నటీనటులు : ధృవ, ప్రీతి సింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, కంచెరపాలెం రాజు, సమ్మెట గాంధీ, జీవన్ కుమార్, రామారావు జాదవ్, లక్ష్మణ్ మీసాల, లక్ష్మీకాంత్ దేవ్, లావణ్య తదితరులు
బ్యానర్ : బిగ్ హిట్ ప్రొడక్షన్స్
ఎడిటర్: గుజ్జల రక్షిత్ కుమార్
మ్యూజిక్ డైరెక్టర్: అనంత నారాయణ ఏజీ, తేజా కునూరు
దర్శకత్వం : ధృవ
నిర్మాత : దీప్తి కొండవీటి, పృద్వీ యాదవ్
విడుదల తేదీ : 2022-06-17

- Advertisement -

బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ధృవ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన సినిమా కిరోసిన్. ప్రీతి సింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, కంచెరపాలెం రాజు, సమ్మెట గాంధీ, జీవన్ కుమార్, రామారావు జాదవ్, లక్ష్మణ్ మీసాల, లక్ష్మీకాంత్ దేవ్, లావణ్య తదితరులు నటించిన ఈ సినిమా కు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. పెళ్లి చూపులు, ఘాజీ, టెర్రర్, చెక్, చైతన్యం వంటి సినిమాలతో తన నటన తో అందరిని ఆకట్టుకున్న ధృవ ఈ సినిమా తో హీరో గా మరో ప్రయత్నం చేస్తున్నాడు. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ లు ఈ సినిమా ను నిర్మించారు. మిస్టరీ నేపథ్యంలో థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజే గ్రాండ్ గా విడుదల కాగా ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్ష లో తెలుసుకుందాం.

కథ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో వరుస హత్యలు జరుగితాయి. అవి ప్రజలను ఎంతో భయబ్రాంతులకు గురిచేస్తాయి. అదేప్రాంతంలో నివాసముంటున్న రామప్ప (సమ్మెట గాంధీ) కూతురు గౌరీ (లావణ్య చెవుల) కూడా హత్యా చేయబడుతుంది. దీంతో ఈ వరుస హత్యల వెనుక కూపీ లగానికి పోలీస్ ఆఫీసర్ ఏసీపీ వైభవ్ (ధృవ)ను రంగంలోకి దిగుతాడు. మరి ఈ మహిళల అత్యాచారం హత్యల వెనుక ఏసీపీ వైభవ్ ఏవిధమైన కారణాన్ని కనుగొంటాడు. స్థానిక ఎమ్మెల్యే (బ్రహ్మాజీ) ఈ కేసులో జోక్యం ఎంతవరకు ఉంది. గౌరీ మరో ఇద్దరి హత్యల వెనుక కారణం ఎవరు? ముగ్గురిని ఎందుకు హత్య చేశారు? ఏపీసీ ధృవ హంతకులకు ఎలాంటి శిక్షను విధించాడు? అనేదే ఈ సినిమా కథ.

విశ్లేషణ :

ఎంతో లోతైన కథ కథనాలున్న సినిమా కిరోసిన్. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్‌కు ఎమోషన్స్ జోడించి చేసిన ఈ సినిమా తో అన్ని తానై వ్యవహరించి ధృవ ఒక మంచి సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.. హీరోగా ధృవ తనదైన శైలిలో కనిపించారు. హ్యాండ్సమ్ లుక్ లో ఎంతో అందంగా కనిపించిన ఈ హీరో రెగ్యులర్ పోలీస్ యాటిట్యూడ్‌కు దూరంగా వెరైటీ గా నటించాడు. సెన్సిటివ్ ఎలిమెంట్స్‌ ను కూడా ఎంతో చక్కగా డీల్ చేసి అద్భుతంగా నటించాడు. ఏసీపీ పాత్రలో అయన ఒదిగిపోయిన తీరు.. అతడి కాన్షిడెన్స్‌ను ప్రతి ఒక్కరు మెచ్చుకోవాల్సిందే. పాత్రల డిజైన్, సస్పెన్స్ పండించిన తీరు, థ్రిల్లింగ్ అంశాలు అన్నీ కూడా చాలా చక్కగా కుదిరేలా చేశాడు. సహజసిద్ధంగా పాత్రల డిజైన్.. పల్లె అందాల నడుమన ఆసక్తికరంగా సాగే కథనం ఈ సినిమా కు అదనపు ఆకర్షణ. బ్రహ్మాజీ కొద్ది సేపు కనిపించినా నవ్వులు పూయించారు. సమ్మెట గాంధీ, మధుసూధన్ రావు, లక్ష్మణ్ మీసాల, ప్రీతి సింగ్, భావన తమ పాత్రల పరిధి మేరకు రాణించారు. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే ఈ సినిమా కి సినిమాటోగ్రఫీ మంచి బలం. విజయ్ భాస్కర్, ఆయన్ మౌళి, అశోక్ మంచి విజువల్స్ ను ప్రేక్షకులకు అందించారు. తేజా కన్నురు నేపథ్య సంగీతం సినిమాలోని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది.గుజ్జల రక్షిత్ కుమార్‌కు ఎడిటింగ్ కూడా చక్కగా ఉంది.తేజస్విని పసుపులేటి సాహిత్యం కొత్తగా ఉంది. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్ గా ఒక మంచి ప్రయత్నం తో ప్రేక్షకులను ఎంతో అలరించారు చిత్ర యూనిట్. కొత్తవారే అయినా ఈ సినిమా కు మంచి ఎఫర్ట్స్ అందించారు యూనిట్.

రేటింగ్ : 3/5

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...